అల్లు అర్జున్ జోడీ కెవ్వుకేక!
అల్లు అర్జున్ జోడీ కెవ్వుకేక!
అల్లు అర్జున్ జోడీ కెవ్వుకేక!
నాగబాబు కూతురు నిహారిక నిశ్చితార్ధ వేడుక గురువారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడకలో మెగా హీరోలంతా పాల్గొన్నారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ తన సతీమణి స్నేహా రెడ్డితో కలిసి స్టైలిష్ లుక్‌లో మెరవడంతో పాటు ఫంక్షన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అల్లు అర్జున్, స్నేహ ఇద్దరు మనీష్ మల్హోత్రా డిజైన్ చేసి దుస్తులు ధరించి వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బ్లాక్ కలర్ డ్రెస్‌లో డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో బన్నీని చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘ఈ జంట ఫ్యాషన్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు’.. ఈ వేడుకకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పిక్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకు కారణం మన స్టైలిష్ స్టార్ రెట్టింపు స్టైలిష్‌గా కనిపించడమే. ఎక్కడికెళ్లినా స్టైల్ విషయంలో, గాడ్జెట్స్ విషయంలో ఏ మాత్రం తగ్గని అల్లు అర్జున్.. నిహారిక నిశ్చితార్థంలో తన లుక్‌తో కెవ్వుకేక అనిపించారు.
భార్య స్నేహారెడ్డిని వెంటపెట్టుకొని ఆయన వస్తుంటే మీడియా కెమెరాలన్నీ వారివైపే తిరిగాయి. బన్నీ జంటని తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో ెరెత్తాయి. బన్నీ- స్నేహారెడ్డి ఫోటోలు చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన లుక్ ఇప్పటికే విడుదలవ్వడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.