ఆచార్య `టీజర్` రేపు గం.10కి పక్కా.. ఫిక్స్
ఆచార్య అప్ డేట్స్‌పై అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వారికి గుడ్‌న్యూస్.. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ తప్ప మరోటి విడుదల కాలేదు. 2020 లో వస్తుందనుకున్న ఆచార్య కాస్త 2021కి వాయిదా పడింది. ఇక షూటింగ్ విషయానికి వస్తే అది చివరిదశకు వచ్చేసింది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కూడా ఈ మధ్యే షూటింగ్లో పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి… కాగా ఫిబ్రవరి లోపే షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ వేగంగా పూర్తి చేసి మే 9న సినిమా విడుదల చేయాలని చూస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఇవన్నీ ఓకే కానీ అసలైన అప్ డేట్స్ మాత్రం బయటికి రావడం లేదు.
దాంతో అభిమానులన సంతోష పెట్టడానికి సినిమా టీజర్ అప్ డేట్ గురించి చిన్న మీమ్ చేసారు కొరటాల, చిరంజీవి. ఈ మీమ్ చిరంజీవి, కొరటాల మాట్లాడుకుంటున్నట్లుగా ఉంది.
ఏమయ్యా కొరటాల ఇప్పటి వరకు ఆచార్య టీజర్ లేదు.. అప్డేట్ లేదు. న్యూ ఇయర్‌కు వస్తుందనుకుంటే రాలేదు.. సంక్రాంతికి వస్తుందేమో అనుకుంటే అప్పుడు కూడా రాలేదు. నువ్వు చెప్తావా నన్ను లీక్ చేయమంటావా అంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఈ మీమ్ క్రియేట్ చేసారు. దానికి వెంటనే లేదు సర్.. జనవరి 27 ఉదయం ఫిక్స్ సర్.. టీజర్ రిలీజ్ డేట్ చెప్పేస్తాను సర్ అంటూ మాటిచ్చాడు.
ఈ మీమ్‌తో మెగఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే అసలు విషయం తేలాలంటే రేపు ఉదయం 10 వరకు ఆగాల్సిందే మరి.

Sirrrrr. Tomorrow morning update fix 🙏 https://t.co/PLdAm7Goml
— koratala siva (@sivakoratala) January 26, 2021