`ఆదిపురుష్`లో లంకేష్‌గా సైఫ్‌

హైద‌రాబాద్‌: అగ్ర‌క‌థానాయ‌కుడు ప్ర‌భాస్ హీరోగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్న చిత్రం `ఆదిపురుష్‌` అనే విష‌యం తెలిసిందే.. కాగా సినిమాకు సంబంధించి తెర‌పై రాముడిగా ప్ర‌భాస్ న‌టిస్తుంటే.. అంతే ప్రాధాన్య‌త ఉన్న రావ‌ణుడి పాత్ర ఎవ‌రు వేస్తున్నారు? అనే ప్ర‌శ్న అందరిలో వ‌చ్చింది. కాగా ఈ అనుమానాల‌న్నింటికి తెర‌దించుతూ.. గురువారం చిత్ర బృందం స‌మాధానం ఇచ్చింది. రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్న టించబోతున్నారు అని ప్రకటించింది. ఓం రౌత్ రూపొందించిన `తానాజీ` చిత్రంలో కూడా సైఫ్ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు సైఫ్. తాజాగా `ఆదిపురుష్`లోనూ విలన్ పాత్రను దక్కించుకున్నాడు. `సైఫ్ అలీఖాన్ సర్‌తో పనిచేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గొప్ప నటుడుతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాన`ని ప్రభాస్ పేర్కొన్నాడు.కాగా వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. గుల్ష‌న్ కుమార్‌, టీ-సిరీస్ ఫిల్మ్ స‌మ‌ర్సిస్తున్న ఈ చిత్రాన్ని భూష‌ణ్ కుమార్‌, కిష‌న్ కుమార్‌, ఓం రౌత్‌, ప్ర‌సాద్ సుతార్‌, రాజేశ్ నాయ‌ర్‌లు నిర్మిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.