‘ఆదిపురుష్’ సెట్‌లో అగ్ని ప్రమాదం

ముంబయి: ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ముంబయిలోని గోరెగావ్ స్టూడియోలో ఆదిపురుష్ షూటింగ్ కోసంభారీ సెట్ ఏర్పాటుచేశారు. మంగళవారమే షూటింగ్ మొదలైంది. అయితే సాయంత్రం 4.10 గంటల సమయంలో మంటలు చెలరేగినట్టు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది
8 ఫైరింజన్లు, 6 వాటర్ ట్యాంకర్లతో మంటలను ఆర్పివేశారు. కాగా ప్రమాద సమయంలో ప్రభాస్, సైఫ్ సెట్‌లో లేరు. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.