ఆమెరికాలో ఇక నుంచి నో మాస్క్!

వాషింగ్ట‌న్‌ (CLiC2NEWS): ప్రస్తుతం ఏ దేశంలో చూసినా అంతా క‌రోనా మ‌య‌మే.. మ‌న పొరుగుదేశం చైనాలో పుట్టి ఈ మ‌హమ్మారి ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తోంది. ముఖ్యంగా ప్ర‌స్తుతం భార‌త్ క‌రోనా విజృంభ‌ణ‌కు విల‌విల‌లాడుతోంది.

కొన్ని రోజుల‌కు ముందు క‌రోనా విల‌యం అమెరికాలో కొన‌సాగింది. అయితే తాజాగా అమెరికన్లకు అక్కడి ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. మాస్కులు ధరించడంపై అమెరికన్లకు ఆ దేశ వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

కొన్ని రోజుల కింద‌ట క‌రోనా విజృంభ‌ణ‌తో అత‌లాకుత‌ల‌మైన అమెరికా ఇప్ప‌డు అక్క‌డ క‌రోనా కేసుల న‌మోదు త‌గ్గింది. సాధారణ పరిస్థితుల వైపు అడుగులు వేస్తోంది. ఇక సీడీసీ ప్రకటనపై అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికన్లకు వ్యాక్సిన్లను శరవేగంగా అందిస్తుండటం వల్లే ఈ మైలురాయి సాధ్యమైందని ఆయ‌న పేర్కొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.