ఆరు రౌండ్లు పూర్తి.. ఆధిక్యంలోనే టీఆర్‌ఎస్‌

హైద‌రాబాద్‌: తెలంగాణ‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు ఆరు రౌండ్లు పూర్తి కాగా టిఆర్ ఎస్ అభ్య‌ర్థి సుర‌భి వాణీదేవి ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి 7,626 ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఆరు రౌండ్లలో

  • సుర‌భి వాణీదేవికి 1,05,710 ఓట్లు
  • రామచందర్‌రావుకు 98,084 ఓట్లు
  • ప్రొఫెసర్‌ నాగేశ్వర్‎కు 50,450 ఓట్లు
  • చిన్నారెడ్డికి 29,627 ఒట్లు
  • ఎల్‌. రమణకు 5,606 ఓట్లు పోలయ్యాయి.
  • మొత్తం ఆరు రౌండ్లలో కలిపి 19,914 ఓట్లు చెల్లుబాటుకాలేదు.

ఐదో రౌండ్‌లో 6555 ఓట్ల ఆధిక్యంలో వాణీదేవి

ఐదు రౌండ్ల తర్వాత టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సమీప బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావు కంటే ఆమె 6,555 ఓట్ల ముందంజలో ఉన్నారు.

  • ఐదో రౌండ్‎లో టీఆర్ఎస్‌కు 88,304 ఓట్లు
  • బీజేపీకి 81,749 ఓట్లు
  • ప్రొఫెసర్‌ నాగేశ్వర్‎కు 42,604 ఓట్లు
  • చిన్నారెడ్డికి 24,440 ఓట్లు
  • ఎల్‌. రమణకు 4,656 ఓట్లు పోలయ్యాయి.
  • మొత్తం ఐదు రౌండ్లలో కలిపి 16,712 చెల్లని ఓట్లు నమోదయ్యాయి.
Leave A Reply

Your email address will not be published.