ఆర్ఆర్ఆర్: అజ‌య్ దేవ్‌‌గ‌న్ మోష‌న్ పోస్ట‌ర్..

ఎస్ఎస్ రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా న‌టిస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే 80 శాతం పైగా షూటింగ్ జరుపుకున్నది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ మూవీలో ఈ ఇద్ద‌రు హీరోల గురువుగా బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ్‌‌గ‌న్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సంద‌ర్భంగా ఇవాళ అజ‌య్ దేవ్‌‌గ‌న్ పుట్టిన రోజు(ఏప్రిల్ 2) కావ‌డంతో.. ఆర్ఆర్ఆర్ లో అజ‌య్ దేవ్‌‌గ‌న్ ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసి ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పెంచారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌లో లోడ్, ఎయిమ్, షూట్ అంటూ ఉద్వేగ‌పూరితంగా సౌండ్ ఇచ్చారు. ఇప్పటికే ఎన్టీఆర్‌,రామ్‌చరణ్, ఒలివియా, ఆలియాభట్‌ ఫస్ట్‌లుక్‌లను చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ పోస్టర్‌లో అజయ్‌ దేవ్‌గణ్‌ పవర్‌ ఫుల్‌ రోల్‌లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ అందరినీ ఎంతోగానే ఆకట్టుకుంటోంది. కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో అజయ్‌ దేవ్‌గణ్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.