ఆర్మూర్ ఎమ్మెల్యే కు కారు చిచ్చు
నిజామాబాద్: ఆర్మూర్ ఎమ్మెల్యే, పియుసి ఛైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి ఏ పని చేసిన వార్తలో నిలుస్తున్నారు. 2018 శాసనసభ ఎన్నికలలో వర్థమాననటి శ్రీరెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తమిళ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే దుబాయ్ లో బ్యాంకు ను మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా దళిత యువకులు హత్యలో ఎమ్మెల్యే పై ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టు లో కొనసాగుతున్బట్లు తెలుస్తోంది. మొన్న ఆర్మూర్ ఆర్టీసీ స్థలంలో నిర్మిస్తున్న క్లాంపెక్స్ కు గత కొన్ని ఏళ్లుగా బకాయిల పై రద్దాంతం జరిగింది. తాజా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రూ.3 కోట్లతో కొనుగోలు చేసిన కారు పై ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశం గా మారింది. హైదరాబాద్ లో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి,ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారు మధ్య సంభాషణ సోషల్ మీడియా లో హల్ చల్ నడుస్తుంది. ఇన్ని రోజులు రాజకీయాలలో ఉండి రూ.20. లక్షల కారు కొనుగోలు చేశానని, ప్రస్తుతం ఈ కారు నొక్కులు పడిందని చెప్పారు. దీనితో ఇద్దరు కలిసి జగ్గారెడ్డి కారును చూశారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ ఉండగానే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా తన రూ.3 కోట్ల కారు వద్దకు వచ్చారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి జీవన్ రెడ్డి దగ్గర కు వచ్చే వరకు కారు డోర్ తీసుకొని కూర్చున్నారు. ఈ వీడియో వైరల్ కాగా ఆర్మూర్ కు చెందిన ఎమార్పీస్ జిల్లా అధ్యక్షుడు మైలావరం బాలు ఎర్పాటు చేసిన ప్లేక్సీల పై నియోజకవర్గం లో చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రూ.3 కోట్ల తో కొత్త కారు కొన్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. అలానే నియోజకవర్గం ప్రజల కోసం కాకుండా ఎమ్మెల్యే కారు కోసమైన రోడ్డు వేయాలని ప్లేక్సీలలో కోరారు. ఆర్మూర్ పట్టణం లోని ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు దర్శనం ఇచ్చాయి. పిప్రి గల్లీలో పేదల కోసం 1300 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేసిన పేదలకు మాత్రం డబుల్ బెడ్ రూం ఇండ్లు వచ్చిన దఖాలాలు లేవాని విమర్శించారు. పేదలకు ఇండ్లు కట్టించకుంటే ఇటీవల రూ.24 కోట్ల తో కోనుగోలు చేసిన ఇంటిని, ఆర్టీసీ కాంప్లెక్స్ ను పేదలతో కలిసి ఆక్రమించుకుంటామన్నారు ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కొనుగోలు చేసిన కారు, ఇల్లు పై చర్చనీయాంశం గా మారింది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ప్లేక్సీల వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇప్పుడు ఎమ్మెల్యే కొనుగోలు చేసిన కారు ఆర్మూర్ లో చిచ్చు రేపుతుంది.