ఆవును హెలికాప్ట‌ర్‌లో ఇంటికి చేర్చిన రైతు

స్విట్జ‌ర్లాండ్: మ‌న దేశంలో ఆవు దైవంతో స‌మానం… రోజు పూజ‌లు చేస్తూ ఉంటాం.. అనాదిగా   మ‌న‌దేశంలో ఈ ఆచారం కొన‌సాగుతోంది. కొంత మంది రైతులు ఆవుల‌ను కేవ‌లం పాల ఉత్స‌త్తి కోసంమే కాకుండా కుటుంబ స‌బ్యులలా చూసుకుంటారు.వాటికి ఏమైనా అయిన విల‌విల్లాడిపోతారు… అదే పాశ్యాత్య దేశాల‌లో ఆవును కూడా ఇలా చూసుకుంటారా.. అన్న అనుమానం మ‌న‌కు క‌లుగుతుంది. దానిక ఈ మ‌ధ్య కాలంలో జ‌రిగిన ఒక సంఘ‌ట‌న నిద‌ర్శ‌నం.. ఇలాంటి ఘ‌ట‌న‌ స్విట్జ‌ర్లాండ్‌లోనూ చోటుచేసుకుంది. న‌డ‌వ‌లేని స్థితిలో ఉన్న త‌న ఆవును హెలికాప్ట‌ర్‌సాయంతో ఆకాశ‌మార్గాన ఇంటి చేర్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియ‌లో వైర‌ల్ అయ్యింది. వివ‌రాల ప్ర‌కారం..స్విట్జ‌ర్లాండ్ స్విస్‌ ఆల్ప్స్‌లోని ఓ పర్వతం వ‌ద్ద మేత‌కు వెళ్లిన ఆవు గాయ‌ప‌డింది. కుంటుతూ.. ఇబ్బంది పడుతూ న‌డుస్తుండ‌డంతో…. రైతు.. ఇంటిదాకా న‌డిస్తే మ‌ళ్లీ ఆవుకు నొప్పి ఎక్కువవుతుంది అనుకున్నాడు. వెంట‌నే హెలికాప్ట‌ర్ సాయం కోర‌గా రెస్క్యూ టీమ్ వచ్చి ఆవుకి తాళ్లు కట్టి క్షేమంగా ఇంటికి చేర్చారు. దీనికి సంబంధించిన వీడియోను ఎవ‌రో తీసి ఓ న్యూస్‌ ఛాన‌ల్‌కి ట్యాగ్ చేయ‌గా అది కాస్తా వైర‌ల్ అయ్యింది. ల‌క్ష‌ల‌మంది ఈ వీడియోను వీక్షించారు.

Leave A Reply

Your email address will not be published.