ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు వాయిదా..

హైద‌రాబాద్‌: తెలంగాణ‌లో ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్స్‌పై బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇంట‌ర్మీడియ‌ట్ ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు వాయిదా వేసింది. ఈ నెల 7వ తేదీన జ‌ర‌గాల్సిన ప్రాక్టిక‌ల్స్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు బోర్డు వెల్ల‌డించింది. వాయిదా ప‌డిన ప‌రీక్ష‌లు మే 29 నుంచి జూన్ 7 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇంట‌ర్ బోర్డు స్ప‌ష్టం చేసింది. థియ‌రీ ప‌రీక్ష‌ల త‌ర్వాత ప్రాక్టికల్స్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు బోర్డు వెల్ల‌డించింది.

Leave A Reply

Your email address will not be published.