ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయండి
ట్విట్టర్లో గుర్తు చేసిన ఆదాయపుపన్ను ఐటి విభాగం

ఢిల్లీ: డిసెంబరు 21 నాటికి దేశ్యాప్తంగా 3.75 కోట్ల మంది పన్ను చెల్లింపు దారులు తమ ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేశారు. ఈ మేరకు ఐటి విభాగం మంగళవారం వెల్లడించింది మిగతా వారు కూడా రిటర్నుల కోసం దాఖలు చేసుకోవాలంటూ ట్విట్టర్ వేదికగా సూచించింది.
”మీకు తెలుసా.. 2020-21 మదింపు సంవత్సరానికి(2019-20 ఆర్థిక సంవత్సరం)గానూ ఇప్పటికే 3.75కోట్ల మంది పన్నుచెల్లింపు దారులు ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. మీరు కూడా మీమీ రిటర్నులు సమర్పించారా? చేయకపోతే.. ఇప్పుడే చేయండి!” అని ఆదాయపుపన్నువిభాగం ట్వీట్ చేసింది.
డిసెంబరు 21 నాటికి 2.17కోట్ల మంది ఐటీఆర్-1, 79.82లక్షల మంది ఐటీఆర్-4, 43.18లక్షల మంది ఐటీఆర్-3, 26.56లక్షల మంది ఐటీఆర్-2 దాఖలు చేశారు. ఐటీ రిటర్నుల దాఖలుకు డిసెంబరు 31వరకు గడువు ఉన్నది.
కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు ఐటీ రిటర్నుల దాఖలకు కేంద్రం గడువు పొడగించింది. మొదట జులై 31వరకు గడవు ఉండగా.. దాన్ని అక్టోబరు 31 వరకు పెంచింది. ఆ తర్వాత డిసెంబరు 31వరకు పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ‘2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆదాయ పన్ను రిటర్నుల దాఖలను డిసెంబరు 31వరకు పొడిగించారు. అదే విధంగా ఆడిటింగ్ చేసిన ఖాతాల ఆధారంగా ఆదాయ పన్ను చెల్లించే వారికి చివరి తేదీని జనవరి 31,2021గా నిర్ణయించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ – ఆదాయపు పన్నుశాఖ (సీబీడీటీ) పేర్కొన్నది.
Do you know that 3.75 crore taxpayers have already filed their Income Tax Returns for AY 2020-21 till 21st December, 2020?
Have you filed yours yet?
If not, File NOW!For filing your #ITReturn for AY 2020-21 please visit: https://t.co/EGL31K6szN#ITR#AajHiFileKaro pic.twitter.com/lEfG92J2D7
— Income Tax India (@IncomeTaxIndia) December 22, 2020