ఈరోజు రాత్రి హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్ల మూసివేత

హైదరాబాద్‌ : జగ్‌నేకీ రాత్‌ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నగరంలోని ఫ్లైఓవర్లను గురువారం అర్ధరాత్రి నుంచి మూసివేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు కొత్వాల్‌ అంజనీకుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఇవి అమలులో ఉంటాయి. గ్రీన్‌ల్యాండ్స్, లంగర్‌హౌస్‌ ఫ్లైఓవర్లతో పాటు పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు.

జగ్‌నేకీ రాత్‌ సందర్భంగా హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో భారత్‌లో ఆజాదీకి అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తుండటంతో ఇందులో భాగంగా రేపు హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి. ఈ మేర‌కు కొత్వాల్‌ అంజనీకుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజ్‌ ఐలాండ్, ఛాపెల్‌ రోడ్‌ టీ జంక్షన్, ఓల్డ్‌ సైఫాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్, బషీర్‌బాగ్‌ జంక్షన్, ఇక్బాల్‌ మినార్, ఏఆర్‌ పెట్రోల్‌ పంపుల నుంచి వాహనాలను మళ్లిస్తారు.

Leave A Reply

Your email address will not be published.