ఉద్యోగ సంఘాలతో చర్చలకు ముఖ్య‌మంత్రి ఆదేశం

హైదరాబాద్‌: వేత‌న స‌వ‌ర‌ణ‌, పదోన్నతులు, సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చించాలని తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ త్రిసభ్య కమిటీని ఆదేశించారు. వారం, పదిరోజుల్లో చర్చలు పూర్తి చేయాలని ఈ సంద‌ర్భంగా సీఎస్‌కు సూచించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్‌ కుమార్‌ చర్చించనున్నారు. ఈ నేప‌థ్యంలో ఉద్యోగ సంఘాల‌తో పిఆర్సీ, ప‌దోన్న‌తులు, ఇత‌ర స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌లు ప్రారంభించాల‌ని.. వారం ప‌ది రోజుల్లో పూర్తి చేయాల‌ని సిఎస్‌ను ఆదేశించారు. ఆ నివేధిక ఆధారంగా కేబినెట్‌లో చ‌ర్చించిన అనంత‌రం వేత‌న స‌వ‌ర‌ణ‌పై స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకొంది.

Leave A Reply

Your email address will not be published.