ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు!

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు మన పెద్దలు.
సాధారణంగా ఉల్లిపాయ అటే కూరల్లో వాడుకునేది అనే అభిప్రాయమే చాలామందిలో ఉంటుంది.
పచ్చి ఉల్లిపాయను ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే అనేక రకములైన వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.

 

 

మనం నిత్యం వంటకాల్లో వాడుకునే ఉల్లి గడ్డ లో చాలా ఔషధ విలువలు ఉన్నాయి. ఉల్లి గడ్డలో అల్లిసిన్ అనే రసాయనం ఎక్కువగా ఉంటుంది. ఇది క్రిమి సంహారిణి 50 గ్రాముల ఉల్లిపాయ ముక్కల్లో దాదాపు 20 గ్రాముల ఇన్సులిన్ ఉంటుంది. ఇది చక్కెర వ్యాధి రాకుండా కాపాడుతుంది. ఇది ఘాటైన వాసన కలిగి ఉంటుంది. పిత్త వ్యాధులను తగ్గించి పొట్టను కాపాడుతుంది. పచ్చి ఉల్లి పాయ లను ఆహారంలో వాడితే గుండె సమస్యలకు ముందుగా పని చేస్తుంది. శరీరానికి హానికరమైన కొవ్వు ను కరిగించి గుండెకు అవసరమైన హెచ్ డి ఎల్ కొవ్వును పెంచు తుంది. ఉల్లి పాయ ముక్కలను సన్నగా తరిగి అందులో పెరుగు వేసి కలిపి పైన జిలకర పొడి వేసి భోజనంలో తింటే గ్యాస్టిక్ సమస్యలు తగ్గి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

(త‌ప్ప‌క చ‌ద‌వండి: తైలాభ్యంగనము)

ఒక వేళ ముక్కులో నుంచి రక్తం కారితే వెంటనే ఉల్లిపాయను కోసి వాసన చూస్తే రక్తం కారడం ఆగిపోతుంది. ఉల్లి పాయ రసాన్ని ముక్కులో వేసినా ఆగి పోతుంది. ఎండా కాలం లో తిరిగే ప్పుడు ఉల్లి గడ్డను జేబులో వేసుకుని లేదా టోపీ లో పెట్టి ఉంచితే ఎండ దెబ్బ తగలదు. మొలల వ్యాధి ఎక్కువగా వున్నవారు ఉల్లిగడ్డను ఉడికించి పటిక బెల్లం లేదా మిస్రీ కొద్దిగా నెయ్యి , జిలకర పొడి కలిపి తినాలి. అరిశమొలలు తగ్గి పోతాయి. ఉల్లిగడ్డ వాడితే వీర్య కణాల లోపాన్ని సవరించి పురుషత్వాన్ని పెంచుతుంది. కీళ్ల వాటం , నొప్పులు ఎక్కువైనప్పుడు ఉల్లిపాయను దంచి రసం తీసి ఆవనూనెలో వేసి తైలంగా కాచి నిలువ చేసి దాచుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

మూత్ర పిండాలలో రాళ్ళ సమస్య వచ్చినప్పుడు కొండ పిండి కూర చెట్టు వేరు భాగాన్ని కడిగి రసం తీసి , ఉల్లిగడ్డ రసంతో కలిపి తాగితే మూత్ర పిండాలలో రాళ్లు కరిగి పోతాయి. మూర్చ్ వ్యాధిలో ఉల్లి గడ్డ రసాన్ని ముక్కులో వేస్తె వెంటనే లేచి కూర్చుంటారు . పంటి చిగుళ్ల నుంచి రక్తం కారితే ఉల్లి రసంతో ఉప్పు కలిపి చిగుళ్లపై రుద్దుకుంటే రక్తం రావడం ఆగి పోతుంది . పరి గడుపున ఉల్లి పాయ రసంలో నిమ్మ రసం కలిపి ప్రతిరోజూ తాగితే శరీరం బరువు క్రమంగా తగ్గుతారు ఉల్లి గడ్డను మెత్తగా దంచి అందులో తేనే +నెయ్యి + బెల్లం కలిపి ప్రతి రోజు తింటూ ఉంటే శుక్రవృద్ధి కలుగుతుంది. జీర్ణ శక్తి తగ్గినప్పుడు ఉల్లిని సన్నగా తరిగి పసుపు +జిలకర +ఉప్ప్పు పొడి చేసి భోజనం లో తింటే జీర్ణ శక్తి పెరుగుతుంది.

కొందరికి తీవ్రమైన విరేచనాల వలన శరీరం శుష్క్రించి కొంతకాలం వరకు బలహీనంగా కనిపిస్తారు . అలాంటి వారు నిప్పులపై ఉడికించిన ఉల్లిపాయను మెత్తగా చేసి అందులో వేయఁచిన గసగసాల పొడి కలిపి ప్రతి రోజు తింటే , కొద్ది రోజులల్లో శక్తిని పుంజుకుంటారు . పూర్తిగా ఆరోగ్యవంతులవుతారు . మోకాళ్ళలో నొప్పులు , వాపులు ఎక్కువైనప్పుడు ఎఱ్ఱని ఉల్లిగడ్డను ముద్దగా దంచి అందులో ఆవాల పొడి వేసి కలిపి మోకాళ్లపై రాత్రి పడుకునేముందు కట్టుకుని ఉంచితే మోకాళ్ళ నొప్పులు ,వాపులు తగ్గి పోతాయి. తేలు కాటు వేస్తె , ఉల్లిగడ్డను అడ్డముగా కోసి కాస్త సున్నం రాసి కొట్టిన చోట రుద్దితే విషయాన్ని పీల్చుకుంటుంది.జెర్రీ కుడితే ఉల్లి గడ్డ +వెళ్లి పాయలు సమనగా తీసుకుని, దంచి ఆ ముద్దను కుట్టిన చోట కడితే విషయాన్ని పీల్చు కుంటుంది.

-పి.కమలాకర్ రావు

1 Comment
  1. Affiliate Marketing says

    Wow, superb weblog structure! How long have you ever been blogging for? you made blogging look easy. The overall look of your website is magnificent, as well as the content!!

Leave A Reply

Your email address will not be published.