ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్

హైద‌రాబాద్ (CLiC2NEWS): క‌రోనా సెకండ్ వేవ్ సామాన్యుల‌నే కాకుండా కేంద్ర మంత్రులు, ముఖ్య‌మంత్రులు, మంత్రులు, ఇత‌ర నాయ‌కులు, ప్ర‌ముఖులు, పారిశ్రామిక వేత్త‌ల‌తో పాటు సినీ తార‌లు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

“తాజాగా నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో నాకు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్దు.. నేను బాగానే ఉన్నాను. నా కుటుంబం, నేను వేరువేరుగా ఐసోలేషన్ లో ఉన్నాము. మేము వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాము. గత కొన్ని రోజులుగా నన్ను సంప్రదించిన వారు కోవిడ్-19 పరీక్షలు చేసుకోవాలని నేను కోరుతున్నా“ అని ట్వీట్ చేశారు ఎన్టీఆర్.

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `ఆర్‌. ఆర్‌. ఆర్‌. లో కొమరం భీంగా నటిస్తున్నారు ఎన్టీఆర్‌. రామ్‌చ‌ర‌ణ్ మ‌రో క‌థానాయ‌కుడు. ఇది పూర్త‌యిన వెంట‌నే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రంలో న‌టించ‌నున్నారు.

దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. ఇక ఇప్పటికే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అనిల్ రావిపూడి వంటి పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.