ఎపిలో కొత్త‌గా 1,398 క‌రోనా కేసులు

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ లో గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్ర వ్యాప్తంగా 31,260 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 1,398 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,05,946 కు చేరింది. ఇందులో 8,89,295 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం 9,417 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 9 మంది మరణించారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7,234 కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 787 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యార‌ని అధికారులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.