ఎపిలో కొత్త‌గా 1,941 క‌రోనా కేసులు

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ లో గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్తగా 1,941 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ ను విడుదల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,10,943 కు చేరింది. వీటిలో 8,91,883 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 6 మంది మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7,251 కి చేరింది. ప్ర‌స్తుతం 11,809 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 835 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.