ఎపిలో కొత్తగా 3,263 కరోనా కేసులు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు కరోనా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 3,263 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,28,664 కు చేరింది.
గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,091 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 8,98,238 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 23,115 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
అలాగే గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 11 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, అనంతపురం, కడప, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7,311 కి చేరింది.