ఎపిలో కొత్తగా 54 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 54 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఎపి వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. అలాగే తాజా కొవిడ్ సోకి ఒక మరణం కూడా సంభవించలేదని పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 888814కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 797 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 880855కు చేరింది. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7162కు చేరిందని అధికారులు పేర్కొన్నారు.