ఎపిలో కొత్తగా 79 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 79 మందికి కరోనా కేసులు నమోదయ్యయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం సాయంత్రం బులిటెన్ విడుదల చేసింది. కాగా గత 24 గంటల్లో ఒక్క మరణం కూడా సంభవించలేదని పేర్కొంది. కాగా రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,88,178కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,157గా చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,32,42,802 పరీక్షలు నిర్వహించారని బులిటెన్‌లో పేర్కొన్నారు.