ఎపిలో నేటి నుంచే ఒంటి పూట బడులు

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 1 (నేటి) నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అధికారులను ఆదేశించారు. 1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు నిర్వహించాలని తెలిపారు. ఉదయం 7.45 నుంచి 11.30 వరకు తరగతులు చేపట్టాలన్నారు. తరువాత మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.