ఎపిలో రేషన్ డోర్ డెలివరీకి హైకోర్టు పచ్చజెండా

అమరావతి: ఎపిలో రేషన్ డోర్ డెలివరీకి హైకోర్టు పచ్చజెండా ఊపింది. కాగా వాహనాల రంగు మార్చాలన్న ఎస్‌ఈసీ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. కాగా మార్చి 15 వరకు ఈ మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ మార్చి 15కు వాయిదా వేసింది.
ఇంటింటికీ రేషన్ పథకం విషయంలో ఎస్‌ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్ వ్యాజ్యం దాఖలు చేశారు. కాగా హైకోర్టు తాజా ఆదేశాలతో వెంటనే రేషన్ డోర్ డెలివరీకి పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది.