ఎపిలో 10,418 కేసులు.. 74 మరణాలు!
అమరావతి : ఎపిలో గడిచిన 24 గంటల్లో 10,418 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,27,513కు చేరుకుంది. అదే సమయంలో 74 మంది కరోనాతో మరణించడంతో కరోనా మరణాల సంఖ్య రాష్ట్రంలో 4,634కు చేరుకుంది. ప్రస్తుతం 97,271 మంది బాధితులు చికిత్స పొందుతుండగా.. ఇప్పటి వరకు 4,25,607 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 71,692 మందికి కరోనా పరీక్షలు చేయడంతో ఎపిలో ఇప్పటి వరకు కరోనా పరీక్షల సంఖ్య 43,08,762కు చేరుకుంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
గత 74 మంది కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. కడప జిల్లాలో 9 మంది, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో 7గురు చొపు్పన, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి 6 గురు చొప్పున, కృష్ణా, శ్రీకాకుళం ఐదుగురు, విజయనగరం 3, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతి చెందారు.