ఎపిలో 7,956 కరోనా కేసులు.. 60 మంది మృతి

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల నమోదు సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా రోజుక సుమారు 10 వేల కేసులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు (సోమవారం) కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 7,956 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్క రోజులో 61529 నమునాలు పరీక్షించగా ఈ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదే సమయంలో 60 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,75,079కి చేరినట్లు రాష్ట్రవైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మరణాల సంఖ్య 4,972కి పెరిగింది. యాక్టివ్ కేసులు 93,204 కాగా, 4,76,903 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 61,529 మందికి కరోనా టెస్టులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎపిలో 46,61,355 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసిఎంఆర్ తెలిపింది.
జిల్లాల వారీగా మృతుల వివరాలు…
చిత్తూరు జిల్లాల్లో 9 మంది, అనంతపురం 7, కర్నూలు, ప్రకాశం, విశాఖట్నం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, తూర్పు గోదావరి, కడప, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, నెల్లూరు జిల్లాలో 3, గుంటూరులో ఇద్దరు మరణించినట్లు తాజా బులిటెన్‌లో వెల్లడించారు.