ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్‌డేట్స్

హైద‌రాబాద్, న‌ల్ల‌గొండ‌: మూడు రోజులైనా ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల ఫ‌లితాల ఉత్కంఠ వీడ‌లేదు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, నల్గొండ-వరంగల్‌-ఖమ్మం స్థానాల ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉంది. ఈ రోజు రాత్రికి ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అధికారులు భావిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌ల్ల‌గొండ‌లో 67 మంది, హైద‌రాబాద్‌లో 87 మంది చొప్పున అభ్య‌ర్థుల‌ను ఎలిమినేష‌న్ చేసి లెక్కిస్తున్నారు. ప్ర‌తీ రౌండ్‌లోనూ టిఆర్ ఎస్ ఆధిక్య‌త క‌న‌ప‌రిచిన‌ప్ప‌ట‌కి.. వ్య‌త్యాసం త‌క్కువ‌గా ఉండ‌టం ఆసక్తిని పెంచుతోంది.

నల్గొండ‍‍‍, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్‌డేట్స్‌
67 వ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేట్ అనంతరం అభ్యర్దుల వారిగా వచ్చిన ఓట్ల వివరాలు

  • పల్లా రాజేశ్వర్‌ (టీఆర్‌ఎస్‌ అభ్యర్థి)- 1180
  • తీన్మార్‌ మల్లన్న మల్లన్న (స్వతంత్ర అభ్యర్థి)- 1750
  • కోదండరామ్ (టీజేఏసీ అభ్యర్థి) -2363

మొత్తం ఓట్లు…

  • పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్)1,18,566.
  • తీన్మార్ మల్లన్న (స్వతంత్ర్య అభ్యర్థి). 93,608 మల్లన్న
  • కోదండరాం (టీజేఎస్)81,472
  • సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై పల్లా రాజేశ్వర రెడ్డి 24,958 ఓట్ల ఆధిక్యం ఉన్నారు.

తొలి ప్రాధాన్యంలో గెలుపు కోటా ఓట్లు రాకుంటే..
తొలి ప్రాధాన్యంలో గెలుపు కోటా ఓట్లు రాకుంటే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. పోటీ చేసిన మొత్తం అభ్యర్థుల్లో తక్కువ ఓట్లు పొందిన వారిని గుర్తిస్తారు. తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థుల రెండో ప్రాధాన్యం ఓట్లు గుర్తిస్తారు. రెండో ప్రాధాన్యం ఓట్లను గుర్తించి ఆ అభ్యర్థికి ఓట్లను జమ చేస్తారు. క్రమంగా తక్కువ ఓట్ల అభ్యర్థిని లెక్కింపు ప్రక్రియ నుంచి తొలగింపు జరుగుతుంది.

ఎవరికి ఎన్ని ఓట్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవికి 1,19,619 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 1,10,500 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొ. నాగేశ్వర్‌కు 59,648 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 36,726 ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓట్లలో 89 మంది అభ్యర్థులు ఎలిమినేషన్‌ అయ్యారు. 9,119 ఓట్ల ఆధిక్యంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి ముందంజలో ఉన్నారు.

నల్గొండ– ఖమ్మం– వరంగల్‌ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత

  • పోటీ చేసిన అభ్యర్థులు – 71
  • మొత్తం ఓట్లు – 5,05,565
  • పోలైన ఓట్లు- 3,87,969
  • చెల్లని ఓట్లు- 21,636
  • చెల్లిన ఓట్లు -3,66,333
  • గెలిచేందుకు రావాల్సిన ఓట్లు -1,83,167
  • పల్లా రాజేశ్వర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌)- 1,10,840 (30.25 శాతం)
  • తీన్మార్‌ మల్లన్న (స్వతంత్ర) -83,290 (22.73 శాతం)
  • కోదండరాం (టీజేఎస్‌)- 70,072 (19.12 శాతం)
  • గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి (బీజేపీ)- 39,107 (10.67శాతం)
  • రాములు నాయక్‌(కాంగ్రెస్‌)- 27,588 (7.53 శాతం)

తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత

  • హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌
  • పోటీ చేసిన అభ్యర్థులు – 93
  • మొత్తం ఓట్లు – 5,31,268
  • పోలైన ఓట్లు – 3,58,348
  • \చెల్లని ఓట్లు- 21,309
  • చెల్లిన ఓట్లు – 3,37,039
  • గెలిచేందుకు రావాల్సిన ఓట్లు -1,68,520
  • ఎస్‌.వాణిదేవి (టీఆర్‌ఎస్‌)- 1,12,689 (33.43 శాతం)
  • ఎన్‌.రాంచందర్‌రావు (బీజేపీ) -1,04,668 (31 శాతం)
  • కె.నాగేశ్వర్‌ (స్వతంత్ర)- 53,620 (15.9 శాతం)
  • చిన్నారెడ్డి (కాంగ్రెస్‌) -31,554 (9.36 శాతం)
Leave A Reply

Your email address will not be published.