ఎర్రకోటపై రైతన్న జెండా!
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహిస్తున్న నిరసనతో దేశ రాజధాని నగరం రణరంగంగా మారింది. ముఖ్యంగా రిపబ్లిక్ డే రోజున రైతులు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పలు చోట్ల రైతులకు, పోలీసులకు తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. కాగా 72వ గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై రైతులు తమ జెండాను ఎగురవేశారు. చట్టాలను వ్యతిరేకిస్తూ ట్రాక్టర్ ర్యాలీ తీసిన రైతులు ఢిల్లీ నగరంలోకి దూసుకువెళ్లారు. వేలాది సంఖ్యలో సిక్కు రైతులు ఇవాళ ఉదయం నగరం నలువైపుల నుంచి ర్యాలీ తీశారు. రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకలు జరుగుతున్న సమయంలోనే.. ట్రాక్టర్లతో ర్యాలీ తీశారు. ర్యాలీలో భాగంగా నగరంలోకి అనుమతి లేని ప్రాంతాల్లోకి ట్రాక్టర్లు వెళ్లకుండా పోలీసులు బస్సులను అడ్డుగా ఉంచారు. దీంతో ఢిల్లీట్రాన్స్‌పోర్టు బస్సులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. నగరంలోకి దూసుకువచ్చిన రైతులను పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నారు. ఎర్రకోట ప్రాంగణానికి కూడా భారీ సంఖ్యలో రైతు ఆందోళనకారులు వచ్చారు. అయితే కోటపైకి ఎక్కిన ఓ రైతు జెండాలను పాతారు. కాగా ఒ వైపు వేల సంఖ్యలో రైతుల ఆందోళన.. మరోవైపు వారిని నిలువరించేందుకు భారీగా మోహరించిన పోలీసులు.. దాంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది.
#WATCH A protestor hoists a flag from the ramparts of the Red Fort in Delhi#FarmLaws #RepublicDay pic.twitter.com/Mn6oeGLrxJ
— ANI (@ANI) January 26, 2021