ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌పై స్టే కొనసాగింపు

హైద‌రాబాద్‌: ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్ఎస్ పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా హైకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. వీటిపై స్టే యథావిథిగా కొనసాగించిన హైకోర్టు ఆదేశించింది.. ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్ఎస్‌పై సుప్రీంకోర్టులో విచార‌ణ తేలేవ‌ర‌కు ప్ర‌జ‌ల‌పై ఎలాంటి బ‌ల‌వంత‌పు చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి హైకోర్టు స్ప‌ష్టం చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వం 2016లో బిఆర్ ఎస్ ప‌థ‌కం తీసుకొచ్చింది. ఇటీవ‌ల ఎల్ ఆర్ ఎస్‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించింది. కాగా దీనిపై హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యాలు దాఖ‌ల‌య్యాయి.

కాగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అర్డర్‌ కాఫీలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌లపై ఇప్పటికే మూడు రాష్ట్రాలను ఇంప్లీడ్‌ చేసింది సుప్రీం.. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌లపై విధివిధానాలు తెలపాలని మూడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తుది ఆదేశాల తర్వాత ఈ పిటిషన్ ను విచారిస్తామని హైకోర్టు పేర్కొంది. అప్పటి వరకు బీఆర్ఎస్ పై స్టే యథావిథిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఎల్ఆర్ఎస్ పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని హైకోర్టు పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.