ఎస్పీ బాలుకు తిరగబెట్టిన అనారోగ్యం

హెల్త్‌ బులిటిన్‌ విడుదల చేసిన ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు

చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం హెల్త్‌ బులిటిన్‌ విడుదల చేశారు. గత 24 గంటలుగా బాలు ఆరోగ్యం మరింత క్షీణించిందని, ఎక్మో, వెంటిలేటర్ సాయంతో బాలుకు చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. నిపుణుల వైద్య బృందం పర్యవేక్షణలో ఎస్పీ బాలు ఉన్నారని ఎంజీఎం వైద్యులు తెలిపారు. కాగా కరోనా సోకడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో 40 రోజులుగా ఆయనకు వైద్యులు చికిత్సనందిస్తున్నారు. అయితే.. ఇటీవల కరోనా నుంచి ఆయన కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు ప్రకటించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలు తిరగబెట్టినట్టు తెలిసింది. ఈ నెల 19 నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు ఎలాంటి హెల్త్ బులెటెన్ విడుదల చేయకపోవడం గమనార్హం.  40 రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలోనే ఆయన చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అనారోగ్యం తిరగబెట్టడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాసేపట్లో వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయనున్నారు. ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆగస్టు 5నుంచి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన గాయకుడు పూర్తిగా కోలుకుని ఇవాళో, రేపు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని ఎదురు చూస్తున్న అభిమానులను తాజా వార్త కలవర పెడుతోంది. తన తండ్రి బాగానే కోలుకుంటున్నారని బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్‌ నాలుగు రోజుల క్రితమే వెల్లడించారు. రోజూ 10 నుంచి 15 నిమిషాలు ఫిజియోథెరపీ చేస్తున్నారని, ఆస్పత్రి సిబ్బంది సహాయంతో లేచి కూర్చుంటున్నారని చరణ్‌ తెలిపారు. మళ్లీ అనారోగ్యం తిరగగెట్టడంతో బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం పరిస్థితిపై కుటుంబ సభ్యులతో పాటు సినిమా పరిశ్రమకు చెందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంట‌ల‌కు ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం ఆసుప‌త్రి వ‌ర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో మళ్లీ ఆందోళన నెలకొంది.

 

Leave A Reply

Your email address will not be published.