ఎస్.పి. బాలు హెల్త్ అప్‌డేట్: గుడ్ న్యూస్

గాన గంధర్వుడు ఎస్.పి. బాలు కోసం చేసిన పూజలు ఫలించాయి. గత కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నట్టు కనిపిస్తుంది. తాజాగా బాలుని ఆయన తనయుడు చరణ్ వార్డ్‌లోకి వెళ్లి కలిసారు. నాన్న నన్ను గుర్తు పట్టారు. అందరు ఎలా ఉన్నారని సంజ్ఞలు కూడా చేశారని వీడియో ద్వారా చెప్పుకొచ్చాడు చరణ్. ఈ విషయం స్వయంగా ఆయన తనయుడు చరణ్ తెలుపుతూ ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఎస్.పి. బాలు హాస్పిటల్‌లో జాయిన్ అయినప్పటి నుంచి ప్రతి రోజూ ఆరోగ్యపరిస్థితిని చెబుతూ.. ఎస్.పి. చరణ్ వీడియోను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన విడుదల చేసిన వీడియోలో.. తన తండ్రి కోలుకుంటున్నారని, డాక్టర్స్‌కు, వైద్యానికి స్పందిస్తున్నారని తెలిపారు.
‘‘ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్య పరిస్థితి నార్మల్‌గా ఉంది. 90 శాతం ఐసోలేషన్ నుంచి బయటికి వచ్చేశారు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు. వైద్యానికి స్పందిస్తున్నారు. నాన్నగారి కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఎంజీఎం హెల్త్ సెంటర్ వారికి కూడా ధన్యవాదాలు. అలాగే నాన్నగారి కోసం ఎంతో శ్రమించిన, శ్రమిస్తున్న డాక్టర్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు…’’ అని చరణ్ ఈ వీడియోలో తెలిపారు. కాగా ఈ నెల 5న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని రోజుల క్రితం ఆయనను చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
#Spb health update 25/8/20 pic.twitter.com/pX1HXqcd2O
— S. P. Charan (@charanproducer) August 25, 2020