ఏపీలో కొత్తగా 172 కరోనా కేసులు
అమరావతి: గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 172 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఎపి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం సాయంత్రం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కొవిడ్ వల్ల కడప జిల్లాలో ఒక్కరు మరణించారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 7150కు చేరింది. ఎపిలో ఇప్పటి వరకు మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 887238కు చేరింది. వీరిలో ప్రస్తుతం రాష్ట్రంలో 1357 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటి వరకు 878731 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.
