ఏపీలో కొత్త‌గా 289 కరోనా కేసులు

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 289 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,83,876 కి చేరింది. ఇందులో 8,73,855 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2896 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7125కి చేరింది.

Leave A Reply

Your email address will not be published.