ఏపీలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. జూన్ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 7 పేపర్లు(ఒక్కో పేపర్‌కు 100 మార్కులు)గా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జూన్ 7న ఫస్ట్ లాంగ్వేజ్, ఎనిమిదిన సెకండ్ లాంగ్వేజ్, తొమ్మిదో తేదీన ఇంగ్లీష్ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. జూన్ 5వ తేదీ వరకు 10వ క్లాస్ తరగతులు జరగుతాయని.. జూలై 21వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. మే 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలియజేశారు.