ఏపీలో తాజాగా 87 మంది మృతి

ఏపీలో తాజాగా 87 మంది మృతి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు 8 వేల మందికి తగ్గకుండా కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 8,732 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజాగా 87 మంది కరోనాతో మృతి చెందారు. 24 గంటలో్ల 53,712 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. తాజా పరీక్షల్లో 31,814 ట్రూనాట్ పద్ధతిలో, 21,898 ర్యాపిడ్ టెస్టింగ్ పద్ధతిలో చేశారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,817 కు చేరింది. కొత్తగా 10,414 మంది వైరస్ బాధితులు కోలుకుని శనివారం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,91,117 కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 88,138 యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ బాధితుల్లో కొత్తగా 87 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2562 కు చేరింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
తాజాగా 87 మంది కరోనాతో మృతి
తాజాగా 87 మంది కరోనాతో మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో పది మంది, గుంటూరు జిల్లాలో తొమ్మిది మంది, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎనిమిది మంది, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఏడుగురు, నెల్లూరు, విశాఖపట్నం,విజయనగరం జిల్లాల్లో ఆరుగురు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు, కృష్ణా జిల్లాల్లో ముగ్గరు చొప్పున మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 2,562కి చేరింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 28,12,197 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యారోగ్యశాఖ తెలిపింది.