ఏపీలో విజృంభిస్తున్న కరోనా
ఏపీలో విజృంభిస్తున్న కరోనా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 8,012 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,012 మంది కొవిడ్ బారిన పడ్డారని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 88 మంది కరోనాతో మరణించారు. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 2 లక్షల 89 వేల 829కి మొత్తం కరోనా కేసులు చేరాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,650 ఈ వైరస్‌తో మరణించారు. ప్రస్తుతం ఏపీలో 85,945 యాక్టివ్ కేసులున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 2 లక్షల 1234 మంది కోలున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
కరోనా వైరస్తోకారణంగా చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో 10 మంది మృతి చెందారు. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో 9 మంది మృతి చెందారు. అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 8 మంది మరణించారు. విశాఖ 7, గుంటూరు 6, కృష్ణా జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. కరోనా ఇదే ఉధృతిలో కొనసాగితే రెండు రోజుల్లో రాష్ట్రంలో కేసుల సంఖ్య 3లక్షలు దాటే అవకాశం ఉంది. దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత ఈ స్థాయిలో పాజిటివ్‌లు నమోదైన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించనుంది. కాగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 28.60 లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు ఎపి ప్రభుత్వం వెల్లడించింది.