ఒకే ఫ్రేములో స్టార్ హీరోలు..

ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్, ఎగ్జిబిట‌ర్ దిల్ రాజు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నేడు ఏర్పాటు చేసిన పార్టీలో టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులంతా సంద‌డి చేశారు. దిల్ రాజుకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. క‌రోనా ఎఫెక్ట్ తో ఈవెంట్స్ లేక చాలా రోజులే అవుతుంది. దిల్ రాజు బ‌ర్త్ డే సెల‌బ్రేషన్స్ ఈవెంట్ తో తార‌లంతా ఒక్క‌చోట చేరారు. స్టార్ హీరోలు మహేశ్‌బాబు, ప్ర‌భాస్‌, రాంచ‌ర‌ణ్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌తోపాటు రామ్‌, నాగచైత‌న్య దిల్ రాజు కు బ‌ర్త్ డే విషెస్ చెప్పి ఆయ‌న‌తో క‌లిసి కెమెరా ఫోజులిచ్చారు. త‌మ అభిమాన తార‌లు ఇలా ఒకే ఫ్రేములో క‌నిపిస్తుండ‌టంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.