ఒకే రోజు 93 వేల కేసులు!

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ రెండో దశ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 93,249 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్రం ఆదివారం ఉదయం కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,24,85,509కి చేరింది. ఇందులో 1,16,29,289 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 6,91,597 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 513 మంది కరోనాతో మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి భారత్‌లో ఇప్పటివరకు మృతి చెందినవారి సంఖ్య 1,64,623కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 60,048 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వెల్లడించారు.