ఓటరు కార్డు లేకుంటే.. ఇందులో ఒకటి తీసుకెళ్లండి!

హైద‌రా‌బాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్ని‌కల్లో ఓటు వేసే వారి వ‌ద్ద‌ ఓటరు స్లిప్పు ‌తో‌పాటు తప్పని‌స‌రిగా ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఉండాలని రాష్ట్ర ఎన్ని‌కల సంఘం స్పష్టం‌ చే‌సింది. అయితే ఓటరు గుర్తింపు కార్డు లేనివారు ఇతర గుర్తింపు పత్రాలు చూపి తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. ఎన్నికల సంఘం 18 రకాల గుర్తింపు కార్డులను గుర్తించింది. ఓటు వేసేటప్పుడు ఇందులో ఏదో ఒక కార్డు చూపించవచ్చు.

18 ర‌కాల కార్డుల వివ‌రాలు

  • ఆధా‌ర్‌‌కార్డు
  • పాస్‌‌పోర్ట్‌
  • డ్రైవింగ్‌ లైసెన్స్‌
  • రాష్ట్ర, కేంద్ర ప్రభు‌త్వాలు/ప్రభుత్వ రంగ సంస్థలు జారీ‌చే‌సిన సర్వీస్‌ ఐడెంటిటీ కార్డు
  • ఫొటో కలిగి ఉన్న బ్యాంకు పాస్‌‌పుస్తకాలు
  • పాన్‌‌కార్డు
  • నేష‌నల్‌ పాపు‌లే‌షన్‌ రిజి‌స్ర్టార్‌ స్కీమ్‌లో భాగంగా జారీ‌చే‌సిన స్మార్డ్‌ కార్డు
  • ఉపాధి హామీ జాబ్‌ కార్డు
  • హెల్త్‌ ఇన్సూ‌రెన్స్‌ స్మార్ట్‌ కార్డు
  • పెన్షన్‌ డాక్యు‌మెంట్‌ విత్‌ ఫొటో
  • ఎమ్మె‌ల్యేలు, ఎమ్మె‌ల్సీలు అయితే వారి ఫొటో గుర్తింపు కార్డులు
  • ఫొటోలు కలి‌గిన రేష‌న్‌‌కా‌ర్డులు
  • ఫొటోలు కలి‌గిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ధ్రువ‌ప‌త్రాలు
  • ఫ్రీడమ్‌ ఫైటర్‌ ఐడెంటి‌టీ‌కా‌ర్డులు
  • ఆయు‌ధ లైసె‌న్సు
  • విక‌లాం‌గుల ధ్రువీ‌క‌రణ పత్రాలు
  • ఎంపీ‌ల‌యితే వారి ఐడీ కార్డులు
Leave A Reply

Your email address will not be published.