ఓటు వేసిన ర‌జ‌నీ, క‌మ‌ల్

చెన్నై: త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, మ‌క్క‌ల్ నిధి మ‌య్యం చీఫ్ క‌మ‌ల్ హాస‌న్ త‌మ ఓటు హ‌క్కును మంగ‌ళ‌వారం ఉద‌యం వినియోగించుకున్నారు.
థౌజండ్ లైట్స్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని స్టెల్లా మేరిస్ పోలింగ్ బూత్‌లో ర‌జ‌నీకాంత్ ఓటేశారు.

క్యూలైన్‌లో క‌మ‌ల్ హాస‌న్
మ‌క్క‌ల్ నిధి మ‌య్యం చీఫ్ క‌మ‌ల్ హాస‌న్ ఓటేసేందుకు చెన్నై హైస్కూల్‌కు వ‌చ్చారు. క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు ఆయ‌న కుమార్తెలు శృతి హాస‌న్, అక్ష‌ర హాస‌న్ వ‌చ్చారు. క‌మ‌ల్ కుటుంబం మిగ‌తా ఓట‌ర్ల మాదిరిగానే క్యూలైన్‌లో నిల్చుని ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

తమిళనాడులో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో కొన్ని కొత్త పార్టీలు కూడా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం కొత్తగా బరిలోకి దిగింది. కమల్ హాసన్ దక్షిణ కోయంబత్తూరు నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తమ పార్టీ విజయంపై అయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కెప్టెన్ విజయ్ కాంత్ డిఎండికె పార్టీ అన్నాడీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తున్నది. మరో సినీనటుడు, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో అడుగుపెట్టారు. చెపాక్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి కుష్బూ థౌజెండ్ లైట్స్ నియోజక వర్గం నుంచి బరిలో నిలిచారు. తమిళనాడులో రాజకీయ దిగ్గజాలుగా పేరొందిన కరుణానిధి, జయలలితల మరణం తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది.

Leave A Reply

Your email address will not be published.