కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం

విజయవాడ : విజ‌య‌వాడ మ‌ణిహారం క‌న‌క‌దుర్గ ఫై ఓవ‌ర్ ప్రారంభ‌మైంది. వ‌ర్చువ‌ల్ విధానం ద్వారా కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణాశాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ, ఎపి సిఎం జ‌గ‌న్ దీన్ని లాంఛ‌నంగా శుక్ర‌వారం ప్రారంభించారు. అనంతరం రూ.7584 కోట్ల రూపాయల విలువైన మరో 16 ప్రాజెక్టులకు వారు భూమిపూజ చేశారు. మొత్తం రూ.15,592 కోట్ల రూపాయల పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు. ఇప్పటికే రూ.8,007 కోట్ల రూపాయలతో పూర్తైన 10 ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం వైఎస్ జగన్‌లు జాతికి అంకితం ఇచ్చారు. కాగా, రూ.502 కోట్లతో ఆరు వరుసలతో 2.6 కి.మీ మేర దుర్గ గుడి వంతెన నిర్మించబడింది. 900 పని దినాలలో ఫ్లైఓవర్‌ పూర్తయింది.

 

2.6 కి. మీ.ల పొడ‌వున్న క‌న‌క‌దుర్గ ఫైఓవ‌ర్ నిర్మాణాన్ని 2015లో ప్రారంభించారు. దీనికి మొత్తం రూ. 502 కోట్లు ఖ‌ర్చు చేశారు. ఇందులో కేంద్రం వాటా రూ. 355.8 కోట్లు కాగా.. రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.1.46.2 కోట్లు ఖ‌ర్చు చేశారు.

Leave A Reply

Your email address will not be published.