కపిల్‌ దేవ్‌కు గుండెపోటు

న్యూఢిల్లీ : భారత క్రికెట్‌ దిగ్గజం, జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్(61) కు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఢిల్లీలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు గుండెకు యాంజియో ప్లాస్టీ ఆపరేషన్‌ చేశారు. కపిల్‌దేవ్‌కు గుండెపోటు అన్న వార్త విన్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని క్రీడా, రాజకీయ, సినిమా ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. హర్యానా హరికేన్‌గా పేరొందిన కపిల్‌ కెప్టెన్సీలో 1983లో భారత్‌ తొలిసారిగా ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఆ సిరీస్‌లో తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో కపిల్ ఆకట్టుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 131 టెస్టులు, 225 వన్డేలు ఆడిన కపిల్… 9000కు పైగా పరుగులు చేశారు. అంతేగాక టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా కూడా రికార్డు సాధించారు.

Leave A Reply

Your email address will not be published.