కరోనాకు వ్యాక్సిన్ రాదు.. అది ఇప్పుడప్పుడే పోదు: బాలకృష్ణ

కరోనా వైరస్ విషయంలో అశ్రద్ధ వద్దని.. చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. ‘సెహరి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలకృష్ణ ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేసి చిత్ర యూనిట్‌ను శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కరోనా గురించి ప్రజలకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కరోనాతో సహ జీవనం చేయాల్సిందేనని అన్నారు. ‘మనం జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్ వస్తుంది అని అంటున్నారు అది నిజం కాదు. అసలు వాక్సిన్ వచ్చే అవకాశాలు లేవు. కరోనా మన జీవితాంతం ఉంటుంది. దాంతో మనం సహ జీవనం చేయాల్సిందే. ఇవాళ నుండి కార్తీక సోమవారం. అయిన సరే తల స్నానాలు చేయవద్దు’ అని ఆయన సూచించారు.

కరోనా పోవాల్సిన సమయం ఇంకా ఉందని.. ఇప్పుడప్పుడే అది పోదని చెప్పారు. హాస్పిటల్స్ అన్ని రోగాలకు వైద్యం అందించాలని కోరారు. ఇలాంటి కరోనా సమయంలోనూ ధైర్యంగా షూటింగ్ చేస్తున్న ‘సెహరి’ టీమ్‌ను ఆయన అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.