కరోనాతో దేశంలో 515 మంది వైద్యులు మృతి

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: కరోనాతో దేశంలో ఇప్పటి వరకు 515 మంది వైద్యులు మరణించారని ఐఎంఏ ప్రకటించింది. కరోనాతో మరణిచార‌ని శుక్రవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) తెలిపింది. వీరిలో సగం మందికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. “కోవిడ్ -19 రోగులకు చికిత్స అందిస్తున్న 515 మంది వైద్యులు ఇప్పటి వరకు అమరవీరులయ్యారు. వీరందరూ అల్లోపతి డాక్టర్లు, వీటిని వివిధ ఐఎంఏ శాఖల ద్వారా గుర్తించాం. దీని కోసం దేశవ్యాప్తంగా 1,746 శాఖలు పనిచేస్తున్నాయి. వాస్తవానికి ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది’ అని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రాజన్ శర్మ అన్నారు.వాస్త‌వానికి క‌రోనా రోగుల‌కు సేవ చేస్తూ మ‌రణించిన వైద్యుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

ఐఎంఏ డేటాబేస్ ప్రకారం, డాక్టర్ రోగి నిష్పత్తి 1: 194 గా ఉంది. మరణించిన వారిలో మెజారిటీ నంబర్‌(201) వైద్యులు 60 నుంచి 70 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. తరువాత 50 నుంచి 60 సంవత్సరాల వయస్సులో 171 మంది మరణించారు. 70 ఏళ్లు పైబడిన వారు 66 మంది ఉండగా, 59 మంది వైద్యులు 35 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఉన్నారు. 18 మంది వైద్యులు 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినవారు ఉన్నారు.

విధి నిర్వహణలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో తెలపడానికి తమ వద్ద తగినంత డేటా లేదని కేంద్రం తెలిపింది. ప్రజారోగ్యం, ఆస్పత్రులు రాష్ట్రాల పరిధిలోకి వస్తాయని, అందువల్ల కేంద్రం అటువంటి డేటా బేస్‌ను నిర్వహించలేదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఇటీవల పార్లమెంటులో వెల్లడించిన సంగతి తెలిసిందే. కేవలం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీలో భాగంగా ఈ మహ​మ్మరి సమయంలో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు ప్రభుత్వ భీమా పథకం కింద పరిహారం చెల్లించే సంఖ్యను మాత్రమే ప్రభుత్వం నిర్వహిస్తుంది అని ఆయన తెలిపారు.

అయితే కరోనా బారినపడి మృతి చెందిన వైద్యుల వివరాల విషయంలో కేంద్రం తన బాధ్యత లేదంటూ చేతులు ఎలా దులుపుకుంటుందని ఐఎంఏ డాక్టర్‌ శర్మ సూటిగా ప్రశ్నించారు. ప్ర‌జారోగ్యం, ఆసుప‌త్రులు రాష్ట్రాల ప‌రిధిలోకి వ‌స్తాయి. దీంతో క‌రోనా రోగుల‌కు వైద్యం చేస్తూ మ‌ర‌ణించిన రోగుల స‌మాచారం త‌మ‌వ‌ద్ద లేద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి అశ్విన్ కుమార్ చౌటే పార్ల‌మెంటుకు చెప్ప‌ని విష‌యాని్న ఐఎంఎ గుర్తు చేసింది.

Leave A Reply

Your email address will not be published.