కరోనా కేసులలో స్వల్ప మెరుగుదల

న్యూఢిల్లీ: గత 24 గంటల్లో భారత్ లో కోవిడ్-19 సోకిన వారి సంఖ్య 54,366కు తగ్గడంతో స్వల్ప మెరుగుదల కనిపించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. సానుకూల కేసుల సంఖ్యతో పాటు మరణాలు కూడా కొంతమేరకు తగ్గాయి. దేశవ్యాప్తంగా 1.1 లక్షలకు పైగా ప్రజలు ఈ వ్యాధితో మరణించారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 77,61,312కి చేరింది. నిన్న ఒక్క రోజే 690 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,17,306 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. నిన్న 73,979 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్‌ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం 69,48,497 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77,61,312గా ఉండగా.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,95,509గా ఉంది. ఇక గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన 14,42,722 కోవిడ్‌ టెస్టులు నిర్వహించారు. ఇక ఇప్పటి వరకు దేశంలో నిర్వహించిన మొత్తం కరోనా టెస్ట్‌ల సంఖ్య 10,01,13,085గా ఉంది.

Leave A Reply

Your email address will not be published.