కరోనా తగ్గిన తరువాత మంచి నిద్ర, ఇమ్మ్యూనిటి కొరకు..

కరోన వైరస్ వచ్చి తగ్గిన తరువాత చాలా బలహీనంగా ఉంటాం, ఆకలి సరిగ్గా ఉండదు, నోరు కొందరికి ఎగటగా ఉండటం, కొంత మందికి జ్వరం తగ్గిన తరువాత ఆకలి బాగా అనిపించకపోవటం, ఇలా ఉండటం జరుగుతుంది. అందరికీ ఒకేలా ఉండదు, శరీర తత్వాన్ని బట్టి దోషాన్ని బట్టి మారుతుంది.
ఒక ఇనుప ముక్క మట్టిలో ఉన్నపుడు తుప్పు పడుతుంది. దానిని తీసి కొలిమిలో వేసి వేడి చేసి సుత్తితో కొడితే కొత్తగా మెరుస్తూ నిగ నిగలాడుతుంది. అలానే తుప్పు బట్టిన శరీరానికి జ్వరం వచ్చి ఆ టెంపరేచర్ తో శరీరంలో ఉన్న తుప్పు మొత్తం పోయి శరీరం అరోగ్యవంతంగా మారుతుంది.
కానీ కరోనా వైరస్ అలా కాదు ఇది గాలి ద్వారా మరియు ఇతరుల ద్వారా వస్తుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని నుండి కొలుకున్న తర్వాత మనం ఆహార పదార్దాలు, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చక్కగా తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
దీనికి ఒక ప్రణాళిక ప్రకారం నేను నాకు తెలిసిన విషయాలు చెబుతాను.
1. ఉదయం ఒక గ్లాస్ నీటిలో 4 బాదం, ఒక గ్లాస్ నీటిలో 2 అంజీరా, ఒక గ్లాస్ నీటిలో 2 ఎండు ఖార్జుర, ఒక గ్లాస్ నీటిలో 10 కిస్మిస్, నానపెట్టి రాత్రి భోజనం చేసిన తరువాత తిని వేడి వేడి గ్లాస్ పాలు తాగాలి. ఇది మెదడును చైతన్యవంతంగా చేస్తుంది. మెదడుకు బలాన్నిస్తుంది. ఒక బ్రెయిన్ కి సూపర్ టానిక్ గా, ఇమ్మ్యూనిటి బూస్టర్ గా పనిచేస్తుంది.
2. ఉదయం లేవగానే రెండు గ్లాస్ లు నీరు తాగి, ఒక గ్లాస్ వేడి నీటిలో 2 టీ స్పూన్ నిమ్నరసం, ఒక టీ స్పూన్ తేనే కలిపి తాగండి.
3. 30 నిమిషాలు ఆగి వాకింగ్, లేదా యోగ కొద్దిసేపు మాత్రమే చేయాలి. అధికంగా చేస్తే నీరసం వస్తుంది.
4. టిఫిన్ ఆయిల్ ఫుడ్ కాకుండా, ఒక రోజు బార్లీ జావా, రాగి జావా, fruits సలాడ్ ఖీరా, టమాటా, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్, వీటిని మనకు కావాల్సినంత ముక్కలుగా కోసుకుని దాని మీద కొద్దిగా నిమ్మరసం చల్లి తిని ఒక టీ స్పూన్ తేనే నాకలి. సూపర్ గా ఉంటుంది. ఒక వేళ తిన లేకపోతే జ్యూస్ చేసి నిమ్మరసం టీ స్పూన్, తేనే టీ స్పూన్ కలిపి తాగండి. మైండ్ బ్లోయింగ్ అండ్ సూపర్ గా ఇమ్మ్యూనిటి బూస్ట్ గా పనిచేస్తుంది. నీరసం పోగొడుతుంది.
5. మధ్యాహ్నం భోజనం తరువాత మజ్జిగ తాగండి.
6. సాయంత్రం లైట్ exercises చేయండి.
7. రాత్రి 7 గంటలకు మంచిగా జొన్న రొట్టె లేదా అన్నం తినండి.. 10 గంటలకు పడుకోండి.
కరోన వైరస్ వచ్చి తగ్గిన తరువాత నిద్ర రాదు.
దానికి మనకు కొంత ఇమ్మ్యూనిటి పెంచుకుంటే నిద్ర వస్తుంది.
1. అశ్వగంధ చూర్ణం ఒక టీ స్పూన్ గ్లాస్ వేడి పాలలో వేసుకొని day by day తాగండి.
2. ప్రాణాయామం లో అనులోమ విలోమము ఉదయం సాయంత్రం 10 నిముషాలు చేయండి మంచి నిద్ర పడుతుంది.
3. సరస్వతి కషాయం అంటే టానిక్ దొరుకుతుంది తెచ్చుకొని తాగండి. లేదా పడుకొనేటపుడు అరికాళ్ల పాదాలకు కొబ్బరి నూనె రాయండి. చక్కని నిద్ర వస్తుంది.
4. ఉదయం సాయంత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేయండి.
5. తలకు నూనె పెట్టండి. స్త్రీలైతే కండ్లకు కాటుక పెట్టండి. పురుషులైతే సుర్మా కండ్లకు పెట్టండి.
6. శుభ్రమైన దుస్తులు ధరించండి. ఇంట్లో సాంబ్రాణి దూపం రాత్రి వేయండి.
7. ఇంట్లో సహదేవి చెట్టును తెచ్చి మంచం పక్కనే పెట్టండి మంచి నిద్ర పడుతుంది.
–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు, సెల్: 7396126557