కాజల్ పెళ్లి ఫోటోలు వైరల్

‘చందమామ’ పెళ్లి అయిపోయింది. గౌతమ్ కిచ్లూతో కాజల్ అగర్వాల్ వివాహం పూర్తయింది. ప్రేమ వ్యవహారం బయటికి వచ్చి నెల కూడా కాకుండానే పెళ్లిని ముగించేసింది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఇంటర్నెట్లో కాజల్ పెళ్లి ఫోటోలు వైరల్గా మారాయి. ముంబైలోని ఓ ఖరీదైన హోటల్ని తమ బిగ్డేకి వేదికగా ఎన్నుకున్నారు. ఇక కోవిడ్ నిబంధనల నేపథ్యంలో అన్ని నియమాలను పాటిస్తూ.. అత్యంత సన్నిహితుల మద్య కాజల్ పెళ్లి జరిగింది. కాజల్ పెళ్లి పూర్తయినట్లుగా ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫొటో చూసి కాజల్ అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నట్లుగా చెబుతున్నారు.