ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ : అప్డేట్స్
కామారెడ్డిలో పర్యటించిన కవిత
కామారెడ్డిః ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లాలో 22 మండలాలలో ఉదయం 9 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటింగ్ సజావుగా సాగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు
క్యాంపు నుంచి పోలింగ్ కేంద్రానికి
ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో క్యాంపుకు వెళ్లిన టిఆర్ఎస్ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు నాలుగు రోజుల క్రితం క్యాంపుకు తరలించారు. క్యాంపుకు వెళ్లిన సభ్యులందరు ప్రత్యేక బస్సులో నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న కౌన్సిలర్లు
కామారెడ్డి మున్సిపాలిటీకి సబందించి మొత్తం 49 మంది ఓటర్లు ఉండగా అందులో టిఆర్ఎస్ 29, కాంగ్రెస్ 12, బీజేపీ 8 మంది కౌన్సిలర్లు ఎక్స్ అఫిషియోగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఉన్నారు. ఇటీవల ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీజేపీ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి 8 మంది టిఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటింగ్ తీరును పరిశీలించిన కల్వకుంట్ల కవిత
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా, టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత శుక్రవారం కామారెడ్డి లో పర్యటించారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తో కలిసి స్థానికంగా పోలింగ్ సరళిని పరిశీలించారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం లోని పోలింగ్ బూతులో, ఓటింగ్ సరళిని పరిశీలించారు టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత. అనంతరం స్థానిక నేతలు, కార్యకర్తలతో కవిత ముచ్చటించారు. హైదరాబాద్ నుండి కామారెడ్డి చేరుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కు, దారిపొడవునా నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
జిలాల్లోని 22 మండలాలలో మండల పరిషత్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలలో జరిగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియను కలెక్టర్ శరత్ కుమార్ పరిశీలించారు. ఓటింగ్ తీరును అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్క ఓటరుకు ఎన్ 95 మాస్కు అందజేర్యడం జరుగుతుందని, భౌతిక దూరం పాటిస్తూ ఎన్నిక నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
[…] […]