కారు నడిపిన తాబేలు!

ఇది నిజమే.. మీరు చదువుతున్నది నిజమే.. మీకేమైనా అనుమానంగా అనిపిస్తే కింద ట్విట్టర్ లింక్ పోస్టును చూడండి.. అనాది నుండి ఎవరైనా మెళ్లిగా నడిస్తే “ఏరా తాబేలు నడక నడుస్తున్నావ్“ అంటాం.. అంటే తాబేలు కంటె మెల్లిగా నడిచేవారు ఎవరు ఉండరని మనకు తెలిసిందే.. అందుకే ఒక తాబేలు తన పేరుపై ఉన్న ఈ రికార్డును బ్రేక్ చేయాలనుకుందేమో.. అందుకే అది వేగంగా వెళ్లేందుకు కారును ఉపయోగించుకుంటున్నది. అందుకు డ్రైవర్ కూడా అవసరం లేదు. తానే స్వయంగా కారు డ్రైవ్ చేస్తుంది. ఈ తాబేలు కారుడ్రైవింగ్ వీడియో ట్విట్టర్లో హల్ చల్ చేస్తోంది. క్షణాల్లో వేల మంది దీన్ని వీక్షించారు. అన్నట్లు మీకో విషయం చెప్పాలి తాబేలు నడిపే కారు డీజిల్, పెట్రోల్‌తో నడిచే కారు కాదండి.. అది పిల్లలు ఆడుకునే కారు బొమ్మ. కానీ తాబేలు ఈ బొమ్మ కారును కూడా ఫాస్ట్‌గా డ్రైవ్ చేసింది. చెబుతుంటే నమ్మాలనిపించడం లేదు కదా. అందుకే మీరు కింద ఉన్న వీడియోను చూడండి. మీరే నమ్ముతారు.
13 సెకండ్లపాటు నడిచే ఈ వీడియోను ఎర్త్స్ బ్యూటీ ఖాతా ట్విటర్లో షేర్ చేసింది. వీడియోలో మొదట తాబేలు కారుబొమ్మ మీద పడుకొని కాళ్ల సాయంతో కొంత దూరం రయ్ మంటూ ఉరికింది. తర్వాత కాసేపు ఆగి మరలా స్పీడ్ పెంచింది. కారు మీద పడుకోవడంతో కారుతో పాటు తాబేలు కూడా ప్రయాణం చేస్తున్నది. తాబేలు ఆడిన ఈ వింత ఆటలో అది ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది. అందుకే ఈ వీడియోకి 18 వేలమంది వీక్షించారు. ఆలస్యమెందుకు మీరు ఓ లుక్కేయండి మరి.
Significantly improved speed 😘 pic.twitter.com/R5nYYRgaOI
— Earth’s Beauty (@PhysicsAndAstr1) September 16, 2020