కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

జగిత్యాల: జిల్లాలో సోమవారం ఉదయం 3 గంటలకు రోడ్డుప్రమాదం సంభవించింది. జగిత్యాల నుంచి జోగినపల్లికి వెళ్తున్న కారు మేడిపల్లి వద్ద ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. ముగ్గురు మృతి చెందగా, ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన వారు కోరుట్ల మండలం జోగినిపల్లికి చెందిన న్యాయవాది అమరేందర్ రావు కుటుంబసభ్యులుగా గుర్తించారు. అమరేందర్ రావు భార్య శిరీషా కూతురు శ్రేయా, కుమారుడు జయంత్ నలుగురు కారులో హైదరాబాద్ వెళ్ళి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
అమరేందర్ రావుతో పాటు భార్య శిరీష, కూతురు శ్రేయ గల్లంతు అయ్యారు. కుమారుడు జయంత్ చాకచక్యంగా బయటకు వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో కారును బయటకు లాగారు. అమరేంద్రరావుతో పాటు ఆయన భార్య, కూతురు మృతదేహాలను పోలీసులు బయటకు వెలికితీశారు. కాగా అమరేందర్ రావు జగిత్యాలలో న్యాయవాదిగా పనిచేస్తారని స్థానికులు తెలిపారు.