కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న సిఎం కెసిఆర్

కాళేశ్వరం: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం ఉదయం కాళేశ్వరంలోని ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సిఎం దంపతులకు ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి సీఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు దగ్గరుండి సీఎం దంపతులతో స్వామివారికి అభిషేకం చేయించి, ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించనున్నారు. అనంతరం కన్నెపల్లి పంపు హౌజును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించి గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటిదైన లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.