కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఆర్మీ అధికారితో పాటు.. ముగ్గురు జవాన్లు, ఉగ్రవాదులు మృతి

శ్రీనగర్‌ :జమ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని వాస్తవాధీన రేఖ వద్ద ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ సైనికాధికారితో సహా  ముగ్గురు జవాన్లు మరణించారు. వీరిలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు.
జిల్లాలోని మచిల్‌ సెక్టార్‌లో సరిహద్దు రేఖ వెంబడి ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ చేపడుతుండగా..ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు ఉగ్రవాదులు కూడా మరణించారని అధికారులు తెలిపారు. నియంత్రణ రేఖను దాటి దేశంలోకి చొరబబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను..ఆర్మీ, బిఎస్‌ఎఫ్‌ బృందాలు అడ్డుకునే క్రమంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో ఆర్మీ అధికారి, బిఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ సుదీప్‌ సర్కార్‌..మరో ఇద్దరు జవాన్లు మరణించారు. ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.